తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నమ్మ విగ్రహాం నెలకొల్పాలి:నాగం జనార్దన్‌ రెడ్డి - New statue of Naga Janardhan Reddy to be installed

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మరణం తీరనిలోటు అని కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర మరువరానిదని పేర్కొన్నారు.

చిన్నమ్మ విగ్రహాం నెలకొల్పాలి:నాగం జనార్దన్‌ రెడ్డి

By

Published : Aug 7, 2019, 4:43 PM IST

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర బిల్లు ఏర్పాటు, ఆమోదం విషయంలో చిన్నమ్మ సహాకారం మరవలేనిదని కొనియాడారు. తెలంగాణ ధీర వనిత అని పొగిడారు. యావత్‌ రాష్ట్ర ప్రజలు ఆమెకు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఆమె విగ్రహ ఏర్పాటుకు , సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు.

చిన్నమ్మ విగ్రహాం నెలకొల్పాలి:నాగం జనార్దన్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details