తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షోభ పరిస్థితుల్లో దేశం.. కాపాడేందుకే రాహుల్‌ భారత్ జోడో యాత్ర: రేవంత్‌రెడ్డి - Rahul should take over the reins of the AICC

రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యులు బలపర్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి భాజపా విద్వేషాన్ని నింపుతోందని రేవంత్ ఈ సందర్బంగా తెలిపారు. ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉందని.. ఈ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్‌ జోడో యాత్ర అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

revanthreddy
revanthreddy

By

Published : Sep 21, 2022, 3:52 PM IST

రాహుల్‌గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు హైదరాబాద్‌ నాంపల్లిలో సమావేశమైన ఆ పార్టీ నేతలు.... పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పీసీసీ రిటర్నింగ్‌ అధికారి, ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు శ్రీధర్‌బాబు, గీతారెడ్డితో పాటు 300మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన 2 తీర్మానాలకు పార్టీ ప్రతినిధులు ఆమోదం తెలిపారు. పీసీసీ సభ్యులను ఎంపిక చేసే బాధ్యత ఏఐసీసీకి అప్పగిస్తూ ఒక తీర్మానం చేయగా.... కాంగ్రెస్‌ పగ్గాలు రాహుల్‌గాంధీ చేపట్టాలని మరో తీర్మానం చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు.

''రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాలని తీర్మానించాం. తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యులు బలపర్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి భాజపా విద్వేషాన్ని నింపుతోంది. ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.''- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details