తెలంగాణ

telangana

ETV Bharat / state

Republic day Guidelines In TS: కొవిడ్ ఎఫెక్ట్.. గణతంత్ర వేడుకలకు మార్గదర్శకాలు జారీ - సోమేశ్ కుమార్

Republic day Guidelines In TS: కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనసమ్మర్దం లేకుండా, జనం గుమిగూడకుండా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Republic day Guidelines In TS
గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

By

Published : Jan 23, 2022, 5:20 AM IST

Republic day Guidelines In TS: రాష్ట్రంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఉదయం 10 గంటలకు కలెక్టర్ల జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Republic day celebrations: వివిధ శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం విధిగా చేయాలని శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయాలని అన్న ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించి వేడుకలు జరపాలని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details