నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాలకు సంబంధించిన 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలో 3,870 ఉద్యోగాలున్నాయి. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థలో 1,514, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 2,267 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా-శిశు సంక్షేమ శాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్లో 66 సహా ఇతర 9,95 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా-శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అనుమతితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లైంది.