తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ కేసు విచారణ కమిషన్​ కోసం 19 పోస్టులు - state government has allotted 19 posts for the commission of inquiry into the disha case

దిశ కేసులో విచారణ కమిషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 19 పోస్టులు కేటాయించింది. కమిషన్‌ కార్యాలయంలో తాత్కాలికంగా నియమించిన ఉద్యోగులు ఆరు నెలల పాటు  పనిచేయనున్నారు.

Disha_Case
దిశ కేసు విచారణ కమిషన్​ కోసం 19 పోస్టులు

By

Published : Jan 8, 2020, 10:55 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం కేసు విచారణ కమిషన్​ నిమిత్తం 19 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కమిషన్‌ కార్యాలయంలో తాత్కాలికంగా నియమించిన ఉద్యోగులు ఆరు నెలల పాటు పనిచేయనున్నారు.

కమిషన్‌ కార్యదర్శిగా సిట్టింగ్‌ లేదా విశ్రాంత జడ్జి వ్యవహరించనున్నారు. 19 మంది తాత్కాలిక ఉద్యోగుల్లో నోడల్‌ అధికారి, ట్రాన్స్‌లేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, స్టెనోగ్రాఫర్‌ ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఈ నెలాఖరుకు కమిషన్‌... హైదరాబాద్‌ చేరుకొని విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'ఇబ్బందులు లేకుండా ఓటేసేలా ఏర్పాట్లు జరగాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details