స్వచ్ఛ భారత్‌లో రాష్ట్రానికి మొదటిస్థానం - swachh bharat award for telangana
17:56 October 02
స్వచ్ఛ భారత్‌లో రాష్ట్రానికి మొదటిస్థానం.. అవార్డు అందుకున్న సుల్తానియా
స్వచ్ఛ భారత్‌లో దేశంలోనే వరుసగా మూడో ఏడాది మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం.. ఇవాళ అవార్డు అందుకుంది. గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్ విధానంలో స్వచ్ఛ పురస్కారాలను అందించారు. రాష్ట్రం తరఫున పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రం తరఫున అవార్డులు స్వీకరించిన అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. సీఎం కేసీఆర్ రూపొందించి.. అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం దిగ్విజయమైనందునే ఈ పురస్కారాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ అవార్డులు దక్కడానికి మార్గ నిర్దేశనం చేస్తోన్న సీఎం కేసీఆర్.. సహకరిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, జల్‌శక్తి మంత్రికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్