హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయంతో విద్యా వ్యాప్తికి కృషి చేస్తామని మంత్రి ఈటల అన్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుమాయిష్ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశమే హైదరాబాద్ వైపు చూసే విధంగా నుమాయిష్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం - Numaish Exhibition in Hyderabad
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఈటల రాజేందర్ ప్రారంభించారు.
![నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం The start of the Numaish Exhibition in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5562645-970-5562645-1577885005487.jpg)
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం