తెలంగాణ

telangana

ETV Bharat / state

Trains Cancelled: తాత్కాలికంగా 6 ప్రత్యేక రైళ్లు రద్దు - hyderabad latest news

6 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉండడంతో ద.మ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. వాటి పూర్తి వివరాలు.. ఇలా ఉన్నాయి.

The South Central Railway has announced the cancellation of 6 special trains due to low passenger traffic.
6 ప్రత్యేక రైళ్లు తాత్కాలికంగా రద్దు

By

Published : Jun 30, 2021, 12:27 PM IST

ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉండడంతో 6 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.

తాత్కాలిక రైళ్ల రద్దు వివరాలు...

  • విశాఖపట్నం-కాచిగూడ రైలును జూలై 1 నుంచి 14 వరకు
  • కాచిగూడ-విశాఖపట్నం రైలును జూలై 2 నుంచి 15 వరకు
  • విశాఖపట్నం-కడప రైలును జూలై 1 నుంచి 14 వరకు
  • కడప-విశాఖపట్నం రైలును జూలై 2 నుంచి 15వరకు
  • విశాఖపట్నం-లింగంపల్లి రైలును జూలై 1 నుంచి 14వరకు
  • లింగంపల్లి-విశాఖపట్నం రైలును జూలై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే వెల్లడించింది.

మరోవైపు, ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

  • సికింద్రాబాద్‌-అగర్తల రైలు జూలై 5, 12న, అగర్తల-సికింద్రాబాద్‌ రైలు జూలై 9, 16న బయల్దేరుతుంది.
  • అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు జూలై 6 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది.
  • అలాగే, బెంగళూరు కంటోన్మెంట్‌-అగర్తల రైలు జూలై 9 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: వైఎస్‌ షర్మిల ఇంటిముందు అమరావతి పరిరక్షణ సమితి ధర్నా

ABOUT THE AUTHOR

...view details