పాపికొండ విహారయాత్రలో గల్లంతైనట్లుగా భావించిన హైదరాబాద్ చంపాపేట్‌కు చెందిన రాజేష్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. రాజేష్ తాను క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆయన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు శాఖలో పొరుగు సేవల కింద రాజేశ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. అతనితో పాటే పనిచేసే ఏడుగురు సహ ఉద్యోగులతో కలిసి పాపికొండలు చూడడానికి వెళ్లారు. ఈ ఏడుగురిలో రాజేశ్, శివకుమార్, సురేష్, కిరణ్ క్షేమంగా ఉండగా హేమంత్ , రవీందర్, తరుణ్‌ల అచూకీ తెలియాల్సి ఉందని రాజేష్ తల్లిదండ్రులు తెలిపారు.
'అమ్మా... నేను క్షేమంగానే ఉన్నాను' - 'అమ్మా... నేను క్షేమంగానే ఉన్నాను'
పాపికొండ విహారయాత్రలో తమ కొడుకు గల్లంతైనట్లు భావించారు. ఇంతలో కొడుకు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది... తానూ క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. ఈ వార్తతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
'అమ్మా... నేను క్షేమంగానే ఉన్నాను'