దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో పాటు ఎక్కువ వృద్ధిరేటు స్థిరంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని... కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ తెలిపారు. ఈనెల 20న జరగనున్న నీతిఆయోగ్ పాలకమండలి ఆరో సమావేశం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
వృద్ధిరేటు స్థిరంగా ఉండేందుకు చర్యలు అవసరం: రాజీవ్‌గౌబ
ఈనెల 20న జరగనున్న నీతిఆయోగ్ పాలకమండలి ఆరో సమావేశం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ పాల్గొన్న సమావేశంలో... సచివాలయం నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశాన్ని గ్లోబల్ మానుఫాక్చరింగ్ హబ్‌గా మార్చడం, వ్యవసాయరంగ అభివృద్ధి, మౌలికసదుపాయాల మెరుగుదల, మానవవనరుల అభివృద్ధి వేగవంతం చేయడం, క్షేత్రస్థాయిలో సేవల మెరుగుదల, ఆరోగ్యం, పౌష్ఠికాహారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో అన్ని రాష్ట్రాలు బాగా కలిసి పనిచేశాయని రాజీవ్ గౌబ కృతజ్ఞతలు తెలిపారు. అదే తరహాలో ఆర్థికవ్యవస్థకు పూర్వవైభవం తెచ్చేలా కృషి చేయాలని కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్