తెలంగాణ

telangana

ETV Bharat / state

Singareni: బొగ్గు కొరత సమస్య రానివ్వం... వచ్చే నెలలో మరింత ఉత్పత్తి పెంచుతాం - సింగరేణి సీఎండీ శ్రీధర్‌

థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడడంతో మరింత ఉత్పత్తి పెంచనున్నట్లు సింగరేణి సంస్థ పేర్కొంది. వచ్చే నెలలో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును విద్యుత్‌ కేంద్రాలకు రవాణా చేయటమే లక్ష్యంగా పనిచేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి గనిలో వీలైంత ఎక్కువ ఉత్పత్తితో పాటు, రవాణా సామర్థ్యం పెంచాలని సూచించారు.

Singareni
Singareni

By

Published : Oct 19, 2021, 10:44 AM IST

ప్రస్తుతం దేశం విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని సింగరేణి వెల్లడించింది. అందుకే బొగ్గు తవ్వకాలు మరింతగా పెంచాలని కేంద్ర బొగ్గుశాఖ కోరిందని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి పెంచనున్నట్లు సింగరేణి సంస్థ పేర్కొంది. వచ్చే నెలలో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును విద్యుత్‌ కేంద్రాలకు రవాణా చేయటమే లక్ష్యంగా పనిచేయాలని సీఎండీ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని గనుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ప్రతి గనిలో వీలైంత ఎక్కువ ఉత్పత్తితో పాటు, రవాణా సామర్థ్యం పెంచాలని కోరారు. ఉత్పత్తి పెంపునకు అవసరమైన అనుమతులన్నీ వెంటనే అందజేస్తామన్నారు. తెలంగాణలోని విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని సీఎండీ పేర్కొన్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని విద్యుత్‌ కేంద్రాలతో ఒప్పందాలున్నందున వాటికి తగినంత బొగ్గును పంపేందుకు సరఫరాను మరింత పెంచుతామని తెలిపారు.

ఇదీ చదవండి:హుజూరాబాద్​లో తెరాసను కలవరపెడుతున్న "ఆ రెండు గుర్తులు"

ABOUT THE AUTHOR

...view details