గాంధీ వద్ద మౌనిక కుటుంబసభ్యుల ఆందోళన - government
అమీర్పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్ వద్ద పెచ్చులు పడి మృతి చెందిన మౌనిక మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మెట్రో పిల్లర్ వద్ద పెచ్చులు పడి మృతి చెందిన మౌనిక మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధను వ్యక్తం చేస్తున్నారు. మౌనిక మెట్రో స్టేషన్ బయటకి వెళ్తున్న సమయంలో వర్షం రావడం వల్ల... అక్కడే నిలుచుందని.. ఆ సందర్భంలోనే ఆమె మీదం పెచ్చుల పడ్డాయని భర్త హరికాంత్ తెలిపారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.