గ్రేటర్ హైదరాబాద్లో రెండో విడత జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కొవిడ్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య, బల్దియా సిబ్బంది మొత్తంగా 3 లక్షల 42 వేల 479 గృహాల్లో ఫీవర్ సర్వేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1522 బృందాలు భాగస్వామ్యమయ్యాయి.
గ్రేటర్లో కొనసాగుతున్న రెండో విడత ఫీవర్ సర్వే
గ్రేటర్లో రెండో విడత జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కొవిడ్ నియంత్రణలో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీలో 1522 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
గ్రేటర్లో రెండో విడత ఫీవర్ సర్వే
ఇవాళ ఒక్కరోజే 1,28,916 ఇళ్లలో సర్వే చేశారు. ఇటూ నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో ఇవాళ 17841 మంది జ్వర పరీక్షలు నిర్వహించారు. మెడికల్ కిట్లు, ఎంత మందికి జ్వర లక్షణాలున్నాయనే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించలేదు.