తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళా సమస్యల పరిష్కారంలో కేసీఆర్ విఫలం' - అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలు

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలు హైదరాబాద్​లో బుధవారం రోజు ప్రారంభమయ్యాయి. సామాజికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదని పలువురు వక్తలు తెలిపారు.

హైదరాబాద్​లోనే జాతీయ మహాసభలు

By

Published : Nov 14, 2019, 3:00 PM IST

హైదరాబాద్​లోనే జాతీయ మహాసభలు

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని ఓంకార్ భవన్​లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమాఖ్య జాతీయ సహ సమన్వయకర్త అనీస్ జెండాను ఆవిష్కరించారు.

తెరాస ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత చూపుతోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుకన్య ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పర్యాయంలో మహిళలకు కేబినేట్​లో స్థానం కల్పించకపోవడం విచారకరమని అన్నారు. ప్రస్తుత కేబినేట్​లో ఒక మహళకు మాత్రమే ప్రాధాన్యత కల్పించి... అధికారాలను ఆయన వద్దే ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ జనాభాలో సగం ఉన్న మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కూడా రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం బాధాకరమని సుకన్య విచారం వ్యక్తం చేశారు. జాతీయ మహాసభలు ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు హైదరాబాద్​లో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇవీ చూడండి: రఫేల్​పై సుప్రీం తీర్పు.. పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం

ABOUT THE AUTHOR

...view details