తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టల్​ బ్యాలెట్​ దరఖాస్తు గడువు పెంపు: ఎస్​ఈసీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోస్టల్​ బ్యాలెట్​ కోసం దరఖాస్తు , జారీ గడువులను ఎస్​ఈసీ సవరించింది. పోలింగ్​ తేదీకి నాలుగు రోజుల ముందు వరకు పోస్టల్​ బ్యాలెట్​ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది.

Extension of deadline for postal ballot vote
పోస్టల్​ బ్యాలెట్​ దరఖాస్తు గడువు పెంపు: ఎస్​ఈసీ

By

Published : Nov 24, 2020, 7:50 PM IST

Updated : Nov 24, 2020, 8:07 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడినవారు, నవంబర్​ ఒకటో తేదీ తర్వాత కొవిడ్​ నిర్ధరణ అయిన వారు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అందుకు అనుగుణంగా పోస్టల్​ బ్యాలెట్ల కోసం దరఖాస్తు, జారీ గడువులను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది.

పోలింగ్​ తేదీకి నాలుగు రోజుల ముందు వరకు పోస్టల్​ బ్యాలెట్​ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. అటు పోలింగ్​ తేదీకి మూడు రోజుల ముందు నుంచి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Nov 24, 2020, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details