సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఒప్పంద పారిశుద్ద్య కార్మికులు ధర్నా చేపట్టారు. గత రెండు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోనే అతి తక్కువ జీతాలకు పనిచేసే కార్మికుల పట్ల ప్రభుత్వం, డీఎంఈల వైఖరి మారాలని ఏఐటీయూసీ నాయకుడు నరసింహ అన్నారు. కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల క్రితమే తాము అధికారులకు నోటీసు ఇచ్చామని, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని నరసింహ పేర్కొన్నారు. ఈ నెల 11వరకు జీతాలు చెల్లించని పక్షంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పూర్తిస్థాయి సమ్మెకు దిగే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
సమ్మెకు సై అంటున్న పారిశుద్ధ్య కార్మికులు
గత రెండు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ గాంధీ ఆసుపత్రి ఒప్పంద పారిశుద్ద్య కార్మికులు ధర్నాకు దిగారు. సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు సై అంటున్న పారిశుద్ధ్య కార్మికులు