తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత: సీపీ సజ్జనార్​ - సీపీ సజ్జనార్​ తాజా వార్తలు

గృహహింస బాధితుల కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. కమిషనరేట్​ ఆధ్వర్యంలో అంబులెన్స్​లు, షీ బృందం ఆధ్వర్యంలో గస్తీ వాహనాలను ప్రారంభించారు.

The safety of women is the first priority: CP Sajjanar
మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత: సీపీ సజ్జనార్​

By

Published : Jul 24, 2020, 1:20 PM IST

మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ పేర్కొన్నారు. కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లు, షీ బృందం ఆధ్వర్యంలో 3 గస్తీ వాహనాలను ఆయన ప్రారంభించారు.

గృహహింస బాధితుల కోసం ప్రత్యేకంగా గస్తీ వాహనాలు ప్రారంభించినట్లు సజ్జనార్​ పేర్కొన్నారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. డయల్ 100కు వచ్చే కాల్స్‌లో 40 శాతం మహిళలవే అన్న సీపీ.. బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని సీపీ పిలుపునిచ్చారు. ఇప్పటికే 27 మంది ముందుకొచ్చారని వివరించారు. ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే అన్న ఆయన.. ప్లాస్మా దాతలను సమన్వయం చేయడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తి కలవారు 94906 17440 నెంబర్​ను సంప్రదించాలని కోరారు.

ఇదీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details