పరిపాలనలో పారదర్శకత అధికారుల జవాబుదారీతనం లేకపోవడం మూలంగా అవినీతి పెరిగిందని ఆర్టీఏ మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా జలవిహార్ వద్ద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యం' - Former RTA Commissioner Venkateshwar latest news
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా జలవిహార్ వద్ద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పరుగును నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్టీఏ మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అవినీతిని అంతమొందించాలని నినాదాలు చేస్తూ... యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు చెందిన సభ్యులు పరుగును నిర్వహించారు. పరుగులో భాగంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ... ప్రజల్లో అవినీతిరహిత సమాజం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఈ సంస్థ పని చేస్తుందని వెంకటేశ్వర్లు తెలిపారు. యువతను భాగస్వామ్యం చేసి అవినీతి నిరోధక పాలన నెలకొల్పేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి అంతమొందించాలంటే యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.
- ఇదీ చూడండి: భారత్లో కరోనా టీకాపై బుధవారమే క్లారిటీ!