ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న గదిని బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. సంఘటన సమాచారంతో కోడెల ఇంటికి చేరుకున్న క్లూస్ టీం... గదిలోని ఆధారాలను, వేలిముద్రలను సేకరించారు. అనంతరం గదిని సీజ్ చేశారు. గదిలో చరవాణి లభించకపోవడం వల్ల అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులను చరవాణి గురించి పోలీసులు అడగలేదు. కోడెల ఉపయోగించిన చరవాణి కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. చనిపోయే ముందు కోడెల ఎవరితోనైనా మాట్లాడారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లిన కోడెల ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కోడెల ఆత్మహత్య చేసుకున్న గది సీజ్ - KODELA_DEATH_ENQUIRY
బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. గదిలోని వేలిముద్రలు, ఇతర ఆధారాలను క్లూస్ టీం సేకరించిన తర్వాత గదిని మూసేశారు.
కోడెల ఆత్మహత్య చేసుకున్న గది సీజ్