తెలంగాణ

telangana

ETV Bharat / state

registrations in telangana: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలు డీటీలకు.. - తెలంగాణ వార్తలు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తసహీల్దార్లకు అప్పగించాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. ఏడాది కాలంగా ధరణి పోర్టల్‌(Dharani portal telangana) ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలను సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో తహసీల్దార్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఇతర సేవలకు సంబంధించి దృష్టి పెట్టడానికి వారికి సమయం లేకుండా పోయింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని డీటీలకు బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు చేస్తోంది.

registrations in telangana, Dharani portal telangana
తెలంగాణలో రిజిస్ట్రేషన్లు, ధరణి పోర్టల్ వార్తలు

By

Published : Oct 31, 2021, 8:16 AM IST

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల(registrations in telangana) బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్ల(DT news)కు అప్పగించేందుకు రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. ఏడాది కాలంగా ధరణి పోర్టల్‌(Dharani portal telangana) ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలను సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో తహసీల్దార్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఇతర సేవలకు సంబంధించి దృష్టి పెట్టడానికి వారికి సమయం లేకుండాపోయింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ల(registrations in telangana) బాధ్యతలను నాయబ్‌ తహసీల్దార్లకు అప్పగించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. తహసీల్దారు సెలవులో వెళ్లిన సమయంలో డీటీలే (Deputy Tahsildar news) ఇప్పుడు ఇన్‌ఛార్జి హోదాలో ధరణి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఆమోదం లభిస్తే త్వరలోనే అమలు

ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా నమోదవుతున్న స్లాట్ల సమయానికి అనుగుణంగా తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు(registrations in telangana) చేపడుతున్నారు. ఒకటి రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని చోట్లా ఉదయం నుంచి పొద్దుపోయే వరకు జరుగుతున్నాయి. మండల స్థాయిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా అవసరాలకు కేటాయింపు, ప్రాజెక్టులకు భూసేకరణ, విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీ తదితర కీలకమైన ప్రభుత్వ కార్యకలాపాలు తహసీల్దార్లే నిర్వహిస్తున్నారు. దీంతో పరిపాలన పరంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏడాది కాలంలో వీటన్నింటిపై పరిశీలన చేసిన యంత్రాంగం వారికి ధరణి విధుల నుంచి మినహాయింపు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పైగా ధరణి పోర్టల్లో ఇప్పటికే ఉన్న సమాచారం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు(registrations in telangana), మ్యుటేషన్లు(mutation in telangana) ఆటోమెటిక్‌గా జరిగిపోతున్నాయి. తహసీల్దారు, ధరణి ఆపరేటరు కేవలం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. దీంతో ఆ స్థానంలో సమాన హోదా ఉన్న మరో అధికారిని నియమిస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే త్వరలోనే అమలు చేయాలని అనుకుంటున్నారు.

రూ. వెయ్యి కోట్లు దాటిన ధరణి ఆదాయం

గతేడాది నవంబరు రెండో తేదీ నుంచి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వానికి రూ.1,025 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 574 తహసీల్దారు కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల సేవలు అందుతున్నాయి.

ధరణికి ఏడాది

భూరికార్డుల సరళీకరణ, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు, అధికారులకు విచక్షణాధికారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఏడాది క్రితం మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి వెబ్‌పోర్టల్‌ని ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా వినూత్నంగా తీసుకొచ్చిన ఆ ధరణిపోర్టల్ విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకుందనిప్రభుత్వం తెలిపింది. భూలావాదేవీలకు సంబంధించి సురక్షతమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్‌రికార్డుతో అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్‌ అయిన ధరణి భూ సంబంధిత లావాదేవీలకు వన్-స్టాప్ పరిష్కారంగా ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి :Dharani One Year: ధరణి పోర్టల్​కు ఏడాది.. 10 లక్షలకు పైగా లావాదేవీలు

ABOUT THE AUTHOR

...view details