హైదరాబాద్లోని నిజాంపేటలో భారీ వర్షానికి ఓ ఇంటి పహరీ గోడ కూలిపోయింది. స్థానిక గోకుల్ ప్లాజాకి సంబంధించిన సెల్లార్ గుంత తవ్వుతుండగా గోడ కూలిపోయింది. వాన కురవడమే దీనికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. పక్కనే ఉన్న ఇళ్లకు ప్రమాదం ఉండటం వల్ల స్థానికులు ఆయా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. సెల్లార్ పనులు చేయడంలో ఏ మాత్రం నియమ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షానికి కూలిన ఇంటి ప్రహరీ గోడ - heavy rain in Nizampet latest News
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ఓ ఇంట్లో ప్రహరీ గోడ కూలింది. ఫలితంగా చుట్టు పక్కల నివాసితులను స్థానికులు ఖాళీ చేయిస్తున్నారు.
![భారీ వర్షానికి కూలిన ఇంటి ప్రహరీ గోడ భారీ వర్షానికి కూలిన ఇంటి ప్రహరీ గోడ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8143409-279-8143409-1595507636483.jpg)
భారీ వర్షానికి కూలిన ఇంటి ప్రహరీ గోడ