తెలంగాణ

telangana

ETV Bharat / state

Assembly Sessions: మూడురోజుల విరామం తర్వాత ఉభయసభల పునః ప్రారంభం - Telangana news

గులాబ్​ తుపాను కారణంగా మూడురోజుల విరామం తర్వాత ఇవాళ ఉభయసభలు పునః ప్రారంభంకానున్నాయి(Assembly Sessions). హరితహారంపై శాసనసభలో చర్చ జరగనుంది. పరిశ్రమలు, ఐటీ రంగ పురోగతిపై మండలిలో చర్చిస్తారు. పర్యాటకులు, ప్రయాణికులకు వేధింపులు, మోసాలను నిరోధించేందుకు ప్రత్యేకచట్టం కోసం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. నాలుగు చట్టసవరణల బిల్లులపై శాసనసభలో ఇవాళ చర్చ జరగనుంది.

assembly
ఉభయసభల పునః ప్రారంభం

By

Published : Oct 1, 2021, 5:06 AM IST

మూడురోజుల విరామం తర్వాత ఉభయసభలు (Assembly Sessions) ఇవాళ తిరిగి సమావేశం కానున్నాయి. తెలంగాణకు హరితహారం (Telangana Haritaharam)కార్యక్రమంపై శాసనసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. పరిశ్రమలు, ఐటీ రంగ పురోగతిపై మండలిలో చర్చ చేపడతారు. నాలుగు బిల్లులపై ఇవాళ అసెంబ్లీలో చర్చిస్తారు. గృహనిర్మాణసంస్థ, ఉద్యానవన విశ్వవిద్యాలయం, నల్సార్, పంచాయతీరాజ్ చట్టసవరణల బిల్లులపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సమావేశాలకు హాజరుకానున్నారు.

మరో రెండు బిల్లులు...

మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభ ముందు ఉంచనుంది. పర్యాటకులు, ప్రయాణికులను వేధింపులు, మోసాలు నుంచి నిరోధించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి టౌటింగ్ చట్టం బిల్లును హోంమంత్రి మహమూద్ అలీ (Home Minister Mahamood Ali)సభలో ప్రవేశపెట్టనున్నారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు కూడా సభ ముందుకు రానుంది.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు, జీఎస్డీపీ(Gsdp)లో పెరుగుదల, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, పంచాయతీల నిధుల మల్లింపు, పంచాయతీ రోడ్ల మరమ్మతులు, పత్తి సేకరణ అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. రామప్ప ఆలయం వద్ద పర్యాటక ప్రోత్సాహకం, హైదరాబాద్ ఓఆర్ఆర్​పై సౌకర్యాలు, ఆహారశుద్ధి కేంద్రాలు, సీఆర్ఎంపీ కింద రహదార్ల అభివృద్ధి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.

ఇదీ చదవండి: Telugu Academy Funds scam: తెలుగు అకాడమీలో నిధుల గోల్​మాల్​పై త్రిసభ్య కమిటీ విచారణ

ABOUT THE AUTHOR

...view details