భారీ వర్షాలతో రాష్ట్రంలో జలాశయాలన్నీ జల కళను సంతరించుకున్నాయి. ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండిపోయాయి. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, తుంగభద్ర, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది.
భారీ వర్షాలతో నిండుకుండల్లా జలాశయాలు - జలాశయాల సామర్థ్యాలు
ఇన్నాళ్లూ నీరు లేక బోసిపోయిన జలాశయాలు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు తోడు రాష్ట్రంలోనూ వానల కారణంగా జలశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
నిండుకుండలు
నీటి మట్టాలు ఇలా...
- ఆలమట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు... ప్రస్తుత నీటి నిల్వ 121.05 టీఎంసీలు
- నారాయణపూర్ జలాశయ పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు... ప్రస్తుత నీటి నిల్వ 34.39 టీఎంసీలు
- జూరాల జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 2.37 టీఎంసీలు నీరు నిల్వ
- నాగార్జుసాగర్ జలాశయ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు... ప్రస్తుతం నీటి నిల్వ 126.47 టీఎంసీలు
- తుంగభద్ర జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 25.60 టీఎంసీలు
ఇదీ చూడండి : భారీ వర్షాలతో గోదావరికి జల కళ