రంగారెడ్డి, మేడ్చల్ రెండు జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం విశేషం. మేడ్చల్ జిల్లాలో జీహెచ్‌ఎంసీ మినహాయించి 12 కేసులు వచ్చాయి. వీరిలో ఒకరు చనిపోగా మిగలిన 11 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక్క కంటెయిన్‌మెంట్ జోన్ కూడా లేదు. గతనెల 23 తర్వాత కొత్త కేసు ఒక్కటి కూడా వెలుగు చూడలేదని అధికారులు చెబుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో జీహెచ్‌ఎంసీ మినహాయించి 42 కేసులు రాగా 33 మంది చికిత్స తీసుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మహేశ్వరం మండలంలో 70 ఏళ్ల వృద్ధుడు సైతం కోలుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు.
మృతులకు ఇతర రుగ్మతలు