తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికాలో హైదరాబాద్ యువ‌తిపై అత్యాచారం, హత్య - women harassment

భారతదేశంలో ఉన్నా... అమెరికాలో ఉన్నా... మహిళకు భద్రత లేదు. నేడు స్త్రీ బయటకు వెళ్లి స్వేచ్ఛగా విహరించే పరిస్థితులు కరువయ్యాయి. హైదరాబాద్​కు చెందిన యువతి అమెరికాలో దారుణ హ‌త్యకు గురైంది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

the-rape-and-murder-of-a-hyderabadi-girl-in-the-us
అమెరికాలో హైదరాబాద్ యువ‌తిపై అత్యాచారం, హత్య

By

Published : Nov 26, 2019, 1:40 PM IST

Updated : Nov 26, 2019, 2:01 PM IST

అమెరికాలో హైదరాబాద్​కి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్​ ఇల్లినాయిస్​లో చదువుతున్న 19ఏళ్ల రూత్​జార్జ్​ అనే యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఇల్లినాయిస్​ పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగిందంటే...

ఈనెల 23న క్యాంపస్​ పార్కింగ్​ వద్ద యూనివర్సిటీ పోలీసులు రూత్​ మృతదేహాన్ని గుర్తించారు. క్యాంపస్​ సమీపంలో నివాసం ఉండే డొనాల్డ్​ తుర్మాన్​ 22వ తేదీన ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.

నిందితుడు తుర్మాన్​ గతంలో దొంగతనం కేసులో ఆరేళ్లు జైలుకు వెళ్లి వచ్చాడు. హత్య తర్వాత ఆమె చేతిలోని ఐఫోన్​ లాక్కొని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన చికాగో పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. హైదరాబాద్​కు చెందిన రూత్​ తల్లిదండ్రులు 20ఏళ్ల క్రితమే చికాగోలో స్థిరపడ్డారు.

ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!

Last Updated : Nov 26, 2019, 2:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details