తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్‌రావు - prabhakar rao latest news

నిమ్స్‌ ఆసుపత్రికి విద్యుత్ శాఖ 10 వెంటిలేటర్లను సమకూర్చింది. ఇందుకు సంబంధించిన రూ.70 లక్షల చెక్కును నిమ్స్‌ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేందర్‌కు ట్రాన్స్ కో-జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్‌రావు
విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్‌రావు

By

Published : May 29, 2021, 4:57 PM IST

విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్ చేస్తామని ట్రాన్స్ కో-జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సెకండ్‌వేవ్‌లో సుమారు 3 వేల మంది విద్యుత్‌ సిబ్బంది కరోనా బారినపడ్డారని.. రెండు దశల్లో ఇప్పటి వరకు 80 మంది మరణించారని సీఎండీ తెలిపారు.

చెక్కు అందజేత

సామాజిక బాధ్యతలో భాగంగా విద్యుత్‌ శాఖ తరఫున నిమ్స్ ఆసుపత్రికి 10 వెంటిలేటర్లు సమకూర్చారు. అందుకు సంబంధించిన రూ.70 లక్షల చెక్కును నిమ్స్‌ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేందర్‌కు ప్రభాకర్‌రావు అందజేశారు.

ఇదీ చూడండి: gangula: లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్: మంత్రి గంగుల

ABOUT THE AUTHOR

...view details