దేశంలోని ప్రజలంతా ఆశలు, ఆకాంక్షలు ఉన్నవారేనని అసదుద్దీన్ అన్నారు. 9 నిమిషాల జిమ్మిక్కులకు ప్రజల జీవితాలను పరిమితం చేయాలని మోదీ చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న తోడ్పాటు, పేదలకు అందుతున్న సాయం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. సాయం గురించి చెప్పకుండా ప్రధాని కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.
సాయమడిగితే.. దీపాలు ఆర్పమంటున్నారు...
'ప్రణాళిక లేని లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడేది పేదలే' దేశంలో లక్షల మంది పేదలు ఆకలితో ఉన్నారని అసదుద్దీన్ గుర్తు చేశారు. ప్రణాళిక లేని లాక్‌డౌన్ వల్ల పేదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వలస కార్మికులు తమ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని సీఎంలు కోరుతుంటే... దీపాలు ఆపేయమనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.
ఇవీ చూడండి : పీఎం కేర్స్‌కు బండి సంజయ్ భారీ విరాళం