ఏపీకి చెందిన నూకరాజు అలియాస్ కృష్ణ (35) మియాపూర్లోని అబ్దుల్ వాహిద్ ఇంట్లో అద్దెకు ఉన్నాడు. యజమానితో గొడవ కారణంగా ఇల్లు ఖాళీ చేశాడు. కోపం పెంచుకున్న నూకరాజు అబ్దుల్ వాహిద్ కుమారుడిని కిడ్నాప్ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - hyderabad latest news
రెండు సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించారు మియాపూర్ పోలీసులు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
ఐదు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి ఓ వ్యక్తిని అనుమానించారు. మాదాపూర్లో బాబుతోపాటు ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసును ఛేదించిన మియాపూర్ సీఐ వెంకటేశ్, ఎస్తై రవి కిరణ్ అభినందనలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి:ఆర్బీఐ అభయంతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు