హైదరాబాద్ అంబర్‌పేట్ డీడీ కాలనీలో శనివారం జరిగిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు 12 గంటల్లోపే చేధించారు. శనివారం ఉదయం అనసూయ అనే మహిళ స్థానికంగా ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో గొలుసును లాక్కెళ్లారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లోనే చేధించి నిందితులను అరెస్టు చేశారు.
గొలుసు దొంగలు 12 గంటల్లోనే అరెస్ట్ - hydarabad cp
పట్టపగలు నడిరోడ్డుపై మహిళ మెడలో బంగారు ఆభరణాలు అపహరించిన నిందుతులను అంబర్‌పేట్ తూర్పుమండల పోలీసులు 12 గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగు తులాల బంగారం గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల నుంచి నాలుగు తులాల గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకంగా మారిందని సీపీ తెలిపారు. పట్టుబడిన ఇద్దరూ యువకులేనని పేర్కొన్నారు. నిందితులు హర్ష జోషి, మనోజ్ కుమార్, అశ్విన్ సింగ్‌ను కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని సీపీ వివరించారు. వ్యసనాలకు అలవాటు పడిన కొందరు అడ్డదారిలో డబ్బు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని సీపీ హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఉజ్జయిని మహంకాళి బోనాల్లో దొంగల చేతివాటం