తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్సారాయుడు... కెమెరాల దొంగ దొరికేశాడు! - Olx Camera Donga Arrest

జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు కెమెరాలు దొంగతనం చేయటం ప్రారంభించాడు. ఓఎల్ఎక్స్​లో కెమెరాలు అద్దెకు తీసుకుని, వాటిని అపహరించి బయట విక్రయిస్తున్న దొంగను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

కెమెరాల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Oct 2, 2019, 10:51 PM IST

కెమెరాల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

జల్సాలకు అలవాటు పడి కెమెరా దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కామరెడ్డి బిబి పేటకు చెందిన నంగునూరి నిఖిల్ సాయి 2007లో కుటుంబంతో సహా నగరానికి వచ్చాడు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చేరి, వ్యసనాలకు చేస్తూ కాలేజీ నుంచి 2017లో డిటెయిన్ అయ్యాడు. నిఖిల్ కొన్నేళ్ల క్రితం ఓఎల్ఎక్స్​లోఆధార్ జిరాక్స్ మాత్రమే సమర్పించి కెమరా అద్దెకు తీసుకున్నాడు. ఇలా విలువైన కెమెరాలు ఆధార్ జిరాక్స్ ఆధారంగా ఇవ్వటంతో ఓఎల్ఎక్స్​లో కెమెరాలు అద్దెకు తీసుకొని వాటిని బయట విక్రయించసాగాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.

కుకట్​పల్లి బాలాజీ నగర్​లో సునీల్ అనే వ్యక్తి దగ్గర నుంచి డీఎస్ఎల్ఆర్ కెమెరాలు అద్దెకు తీసుకుని తిరిగి ఇవ్వటకపోవటంతో అనుమానం వచ్చి ఆధార్ కార్డుపై ఉన్న చిరునామాకి వెళ్లి చూశాడు. తప్పు అడ్రస్ ఉండటమే కాకుండా నిఖిల్ సాయి నంబర్​కు ఫోన్ చేస్తే మాయమాటలు చెప్తున్నాడు. సందేహం కలిగిన కెమెరా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఖిల్​ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల విలువ చేసే 8 డీఎస్ఎల్ఆర్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి : ఆహార పదార్థాలు కలుషితమై 25 మందికి అస్వస్థత!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details