గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుగట్లు, శిఖం భూములు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. అత్తాపూర్‌లోని.. మల్కచెరువులో చేపట్టిన మోడల్ ప్లాంటేషన్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.
CS On Harithaharam:గ్రేటర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలి: సీఎస్ - గ్రేటర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
గ్రేటర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అత్తాపూర్‌లోని మల్కచెరువులో చేపట్టిన మోడల్ ప్లాంటేషన్‌ను ఆయన పరిశీలించారు. నగరంలో ప్రతి చిన్న ఖాళీస్థలాన్ని వదలకుండా.. 185 చెరువులు, కుంటల్లోని గట్లు, శిఖం భూముల్లో మొక్కలు నాటుతున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణాకు హరితహారం కింద నగరంలో ప్రతి చిన్న ఖాళీస్థలాన్ని వదలకుండా మొక్కలు నాటాలన్న సీఎస్ అన్నిచెరువుల్లోనూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. చెరువుల్లో నీటిమట్టం తగ్గగానే ఆ భూముల్లో నీటి కానుగ మొక్కలు నాటాలని ఆదేశించారు. మల్కచెరువులో మాదిరిగానే మిగిలిన చోట్ల మోడల్ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. మల్కచెరువులోదాదాపు 30 రకాల వృక్షజాతుల మొక్కలు నాటామని అవి ప్రధానంగా స్థానికంగా లభించేవని అధికారులు వివరించారు. ఆ చెరువు కట్టపై దాదాపు కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని185 చెరువులు సహా ఖాళీ స్థలాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.
ఇదీ చూడండి: