ఉగాది పండుగకు కరోనా వైరస్ ప్రభావం పడింది. హైదరాబాద్ నగరంలో ఇది స్పష్టంగా కనపడింది. నారాయణగూడ మార్కెట్లో కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి. మామిడాకులు, వేపపువ్వు, మామిడి కాయలు, కొత్త చింతపండు, బెల్లం, కొత్త కుండలతోపాటు పూజా సామాగ్రి కొనేందుకు ఎక్కువగా రావడం లేదు.
ఇళ్లలోనే ప్రజలు.. మిగిలిన మామిడి కాయలు, కొత్తకుండలు - కరోనా ప్రభావంతో తగ్గిన ఉగాది కొనుగోళ్లు
కరోనా.. కరోనా..కరోనా.. ఎక్కడికెళ్లినా ఇదే పదం.. ఈ పదం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఉగాది పండుగను సైతం జరుపుకునేందుకు ప్రజలు జంకుతున్నారు. మామిడాకులు, వేపపువ్వు, మామిడి కాయలు, కొత్త కుండలు, పూజా సామాగ్రి కొనేందుకు ప్రజలు రావడం లేదని విక్రయదారులు చెబుతున్నారు.
![ఇళ్లలోనే ప్రజలు.. మిగిలిన మామిడి కాయలు, కొత్తకుండలు the-people-in-the-house-the-rest-of-the-mangoes-and-newbies-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6533511-20-6533511-1585088515317.jpg)
ఇళ్లలోనే ప్రజలు.. మిగిలిన మామిడి కాయలు, కొత్తకుండలు
కొవిడ్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమయమయ్యారు. ఉగాది పండుగకోసం బయటకు వచ్చి కరోనా అంటిచుకోవండం ఎందుకని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఎవరూ రాకపోవడం వల్ల కొనుగోళ్ల తగ్గాయని దుకాణదారులు తెలిపారు.
ఇళ్లలోనే ప్రజలు.. మిగిలిన మామిడి కాయలు, కొత్తకుండలు
ఇదీ చూడండి :మనం ఇంట్లో ఉండటమే వారికిచ్చే బహుమతి
Last Updated : Mar 25, 2020, 7:11 AM IST