తెలంగాణ

telangana

ETV Bharat / state

పాపికొండలు బోటు ప్రయాణం ట్రయల్​రన్​ - ap news

ఏపీ పర్యాటక శాఖ గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర ట్రయల్ రన్​ని నిర్వహించింది. కచ్చులూరు బోటు ప్రమాదంతో నిలిపి వేసిన ఈ విహారయాత్రపై.. ప్రస్తుతం ట్రయల్ రన్ చేపట్టారు. ప్రయాణికుల భద్రత, ప్రస్తుత పరిస్థితిపై అధికారుల సమీక్షిస్తున్నారు.

ap tourism
papikondalu

By

Published : Apr 16, 2021, 2:28 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పేరంటాలపల్లి వరకు టూరిజం బోటులో ట్రయల్ రన్ చేపట్టారు. కచ్చులూరు బోటు ప్రమాదంతో ఈ విహారయాత్రను నిలిపివేశారు. 19 నెలల అనంతరం తిరిగి పాపికొండల విహారయాత్ర ట్రయల్ రన్ చేపట్టారు. ప్రయాణికుల భద్రత, ప్రస్తుత పరిస్థితిపై అధికారుల దృష్టి సారించారు. ట్రయల్ రన్​కు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు.

ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నది ప్రవాహం, సీజన్ల పరిస్థితి, బోటు నడిపే సీజన్లపై పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. ప్రమాదాలు జరగ కుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details