అద్దె ఇళ్లల్లో ఉంటూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్ వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతుల్లో భర్తకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఆ ఇంటి యజమాని వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు.
అవమానం.. మహిళను ఇంట్లోకి రానివ్వని యజమాని - anm in Rajamahendravaram
అద్దె ఇళ్లల్లో ఉంటూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రెంట్‌కి ఉంటున్న దంపతుల్లో ఒకరికి వైరస్ సోకగా వారిని యజమానికి ఇంట్లోకి రానియ్యలేదు. సొంతింటికి వెళ్తే స్థానికులు పొమ్మన్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వారి పరిస్థితి దయనీయంగా మారింది.

కొవిడ్ బాధితులకు అవమానం.. మహిళను ఇంట్లోకి రానివ్వని యజమాని
భర్త రాజమహంద్రవరంలోని కొవిడ్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్తకు కొవిడ్ తేలడం వల్ల భార్యను ఆ ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. బాధితురాలు బుర్రిలంకలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఆమె రాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాస్తోంది. సొంతింటికి వెళ్లగా అక్కడ కూడా స్థానికులు ఆమెను అడ్డుకుని ఇంటికి తాళం వేశారు. బాధితురాలు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కొవిడ్ బాధితులకు అవమానం.. మహిళను ఇంట్లోకి రానివ్వని యజమాని
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం