జులై మొదటి వారంలో పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఓయూ పరీక్షల విభాగం వెల్లడించింది. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్డబ్ల్యూ నాలుగో సెమిస్టర్ విద్యార్థులు ఈనెల 22వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని.. రూ. 300 ఆలస్య రుసుముతో ఈనెల 28 వరకు చెల్లించవచ్చునని నోటిఫికేషన్లో పేర్కొంది.
OU Exams: పరీక్షల నిర్వహణకు ఓయూ సమాయత్తం - ou exams fees
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షలకు సన్నాహాలు చేస్తోంది. జులై మొదటి వారంలో పీజీ చివరి సెమిస్టర్, రెండో వారంలో యూజీ చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తద్వారా విదేశాలు లేదా ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది.
OU Exams
బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల మొదటి సంవత్సరం పరీక్షలకు ఫీజు గడువును ఈనెల 25గా నిర్ణయించింది. రూ.200 ఆలస్య రుసుముతో వచ్చే నెల 2వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు.. మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:High Court: పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం