తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన దీక్షలు.. కేటీఆర్​ రాజీనామా చేయాలని డిమాండ్​ - టీఎస్​పీఎస్సీ కేసు

The opposition parties are Protesting: టీఎస్​పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. "మా నౌకర్లు మాక్కావాలి" పేరిట.. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ నేతలు డిమాండ్‌ చేశారు. అటు కాంగ్రెస్‌ సైతం పలు చోట్ల నిరసన తెలిపింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 20, 2023, 10:41 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు నిరసన దీక్షలు

The opposition parties are Protesting: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తూనే ఉంది. సిట్‌ వద్దు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలంటూ విపక్షాల ఆందోళనలు పెద్దఎత్తున సాగుతున్నాయి. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై.. మల్కాజ్​గిరి బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి కూడలిలో.. బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు ఆధ్వర్యంలో.. నిరసన దీక్ష చేపట్టింది. మంత్రి కేటీఆర్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ.. పరీక్షలు రాసిన నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలని.. రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి: చైతన్యపురిలోని శివాజీ చౌక్ వద్ద పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఆయన నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్​పీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మల్లాపూర్‌లో నిరసనదీక్షలో ఆయన పాల్గొన్నారు. టీఎస్​పీఎస్సీపేపర్‌ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ.. నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోనూ బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది.

రాష్ట్రంలో పలుచోట్ల నిరసన దీక్షలు: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోనూ దీక్షలు కొనసాగాయి. ఖమ్మం ధర్నా చౌక్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ దీక్షలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్‌లోని తెలంగాణ కూడలిలో నిరసన దీక్ష చేపట్టారు. మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీపై భేటీ అయిన బీజేపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ యువతకు అండగా ఉండాలని నిర్ణయించారు. హైదరాబాద్ హైదర్‌గూడ లేదా అశోక్ నగర్‌లో టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి యువత సమస్యలకు అనుగుణంగా పోరాటాలు చేయాలని నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి నేరుగా రాలేని వారి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేయనున్నారు.

మంత్రి కేటీఆర్​ రాజీనామా చేయాలి: అబిడ్స్​లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీపై.. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. సిద్దిపేటలోని మంత్రి హరీష్​రావు క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు ముట్టడించాయి. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

"ఇద్దరు వ్యక్తుల మీద కేసు పెట్టి టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజ్​ విషయాన్ని దాటేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందులో కచ్చితంగా కేటీఆర్​ సిబ్బందికి సంబంధం ఉంది. ఆయన పాత్ర కూడా ఇందులో ఉందని బీజేపీ ఆరోపిస్తుందని అంటున్నాను. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది." - ఎన్​వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, బీజేపీ సీనియర్‌ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details