తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంలో ఎన్నో పోషక విలువలు.. తెలుసుకుంటే ఆరోగ్యానికి మేలు

అరిసెలు.. హల్వా.. నువ్వులు.. డ్రైఫ్రూట్స్‌ లడ్డూలు.. వీటన్నింటికీ అద్భుతమైన ఆ రుచి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు.. అదంతా బెల్లం మహిమే! పిండివంటలకు రుచిని అద్దే బెల్లంలో ఎన్నో పోషక విలువలూ ఉన్నాయి. అవేమిటంటే..

By

Published : Jul 7, 2020, 10:16 AM IST

The nutritious value of carbohydrate gingerbread
పిండివంటలకు రుచిని అద్దే బెల్లంలో ఎన్నో పోషక విలువలు

ఒకప్పుడు పిండివంటలకే కాకుండా టీ తయారీకీ బెల్లాన్నే ఉపయోగించేవారు. వండే విధానాన్ని బట్టి బెల్లం రంగు మారిపోతుంది. దీంట్లో అనేక రంగులూ ఉన్నాయి.

పాతబెల్లం లేదా నల్లబెల్లం ఆరోగ్యానికి మంచిది. ఇది రుచిగానూ ఉంటుంది. ఇనుప పాత్రలో వండింది చాలా శ్రేష్ఠమైంది. పంచదారలో కంటే దీంట్లో పోషకాలు ఎక్కువ. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

పోషకాలెన్నో...

బెల్లంలో సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, క్యాల్షియం, కాపర్‌ ఉంటాయి. విటమిన్‌-బి కూడా ఉంటుంది. కెలొరీలూ అధికంగా ఉంటాయి.

ప్రయోజనాలు...

  • ఒంట్లోని నీరు తగ్గిస్తుంది. ఒళ్లు నీరు పట్టకుండా చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది.
  • భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే అన్నం త్వరగా అరుగుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.
  • రుచికే కాకుండా శక్తికి కూడా బెల్లాన్ని తీసుకోవచ్ఛు స్వీట్‌ తినాలి అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నీరసంగా, నిస్సత్తువగా అనిపించినప్పుడు బెల్లం తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
  • ఇతర ఔషధాలతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడితే ఆరోగ్యానికి మంచిది. దీంట్లో సహజ సిద్ధమైన పోషకాలుంటాయి. ఎక్కువకాలం నిల్వ ఉంటుంది కూడా.
  • ఒకప్పుడు బెల్లం పాకాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంట్లోనే బెల్లం పాకాన్ని తయారుచేసి నిల్వ చేసుకోవచ్ఛు మినపరొట్టె, గారెల్లో దీన్ని నంజుకోవచ్ఛు రకరకాల సాస్‌ల కంటే పిల్లలకు బెల్లం పాకం అలవాటుచేస్తే రుచి, పోషకాలు రెండూ అందుతాయి. కాబట్టి సాస్‌కు బదులుగా దీన్ని వాడుకోవచ్ఛు
  • బెల్లం పాకంతో చేసిన నువ్వులుండలు తింటే క్యాల్షియం అందుతుంది. ఈ పాకంతో చేసిన డ్రైఫ్రూట్స్‌ లడ్డూలూ ఆరోగ్యానికి మంచివే.
  • తెల్లగా, ఎర్రగా ఉండే బెల్లాని కంటే నల్లగా ఉండే పాత బెల్లం మంచిది.

బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే కడుపులో నులి పురుగులు పెరుగుతాయి, విరేచనాలవుతాయి. అంతేకాదు బరువూ పెరుగుతుంది.

ఇదీచూడండి: బడిలో పంట పండించి.. వలసలు ఆపిన మాస్టారు!

ABOUT THE AUTHOR

...view details