తెలంగాణ

telangana

ETV Bharat / state

'నూతన మున్సిపల్​ చట్టం కఠినమైనది... చదువుకునే రంగంలోకి దిగండి'

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పని తీరుపై మూడు నెలలకోసారి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కమిటీ మానిటరింగ్ చేస్తుందని మున్సిపల్​  శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. పని చేయని వారిపై పార్టీలతో సంబంధం లేకుండా వేటు వేస్తామని హెచ్చరించారు. ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపునకు పాల్పడమని పేర్కొన్నారు.

By

Published : Sep 22, 2019, 2:16 PM IST

నూతన మున్సిపల్​ చట్టం కఠినమైనది

మున్సిపల్ చట్టంలో అయిదు సవరణలు చేశామని మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జనంలో భయం, అవగాహన కల్పించేందుకే చట్టాన్ని కఠినంగా రూపొందించామన్నారు. 75 గజాలలోపు స్థలాలు ఉన్న వారు ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 76 - 600 గజాల స్థలం ఉన్న వారు ఆరు నెలల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో ఎల్​ఆర్​ఎస్​ సిస్టమ్ తీసుకువస్తామని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే రోడ్లపై ఉన్న అన్ని ప్రార్థన మందిరాలను తొలగిస్తామన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేనని వెల్లడించారు. కేంద్రం ప్లాస్టిక్ నియంత్రణపై చట్టం తీసుకొస్తే దాన్ని అమలు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు.

నూతన మున్సిపల్​ చట్టం కఠినమైనది

ABOUT THE AUTHOR

...view details