అధికారుల ఉదాసీనత వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతోందని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ అభ్యర్థి నారాయణ ఆరోపించారు. డివిజన్లోని పలు కాలనీల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ సరిగా జరగలేదన్నారు.
అధికారుల నిర్లక్ష్యమే పోలింగ్‌శాతం తగ్గడానికి కారణం - జూబ్లీహిల్స్ కార్పొరేటర్ అభ్యర్థి నారాయణ
గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ సరిగా జరగలేదని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ అభ్యర్థి నారాయణ అన్నారు. ఆధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఓటింగ్ శాతం తగ్గుతోందని ఆయన ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యమే పోలింగ్‌శాతం తగ్గడానికి కారణం
ఫిలింనగర్‌లోని పోలింగ్ బూతులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్లిప్పులను ఓటర్లకు అందించకపోవడం కారణంగానే జూబ్లీహిల్స్ పరిధిలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతోందని వెల్లడించారు. పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున అధికారులు స్పందించి ఓటర్లకు స్లిప్పులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.