కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా పంజాగుట్ట నిమ్స్‌లో వైద్యులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వైద్య కమిషన్ బిల్లు రూపకల్పనలో వైద్యులు లేకపోవడం బాధాకరమని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పరీక్ష వల్ల భారతీయ విద్యార్థులు నష్టపోతున్నారని, దీనిని కూడా రద్దు చేయాలని కోరారు.
జాతీయ వైద్య కమిషన్ బిల్లును రద్దు చేయాలి - National Medical Commission
పార్లమెంటులో ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
జాతీయ వైద్య కమిషన్ బిల్లును రద్దు చేయాలి