ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ జాతీయ జెండా వందేళ్ల పండుగను మర్చిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. 75ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కానీ త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసిన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పింగళి వెంకయ్య గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జింఖాన గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 1న విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరణ: వీహెచ్ - The national flag will be hoisted on April 1st in vijayawada
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పాల్సిన అవసరముందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 1న ఏపీలోని విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 1న విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరణ
1921 ఏప్రిల్ 1న విజయవాడలో ఏఐసీసీ సమావేశంలో జాతిపిత మహాత్మాగాంధీ.. మొదటిసారి జెండాను ఆవిష్కరించారని వీహెచ్ వెల్లడించారు. అందుకే మళ్లీ అక్కడే జాతీయ జెండాను ఎగురవేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కష్టాల్లో ఉన్న గ్రానైట్ ఇండస్ట్రీని ఆదుకోండి: ఎంపీ నామ