తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో... నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2022 - పల్లవి ఇంజనీరింగ్ కళాశాల తాజా వార్తలు

NASA Space Apps Challenge: నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2022ను నాగోల్​లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ హ్యాకథాన్‌లో 35 టీమ్‌లు పాల్గొన్నాయి.

NASA Space Apps Challenge
నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్

By

Published : Apr 20, 2022, 8:46 PM IST

NASA Space Apps Challenge: హైదరాబాద్ నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2022ను నాగోల్​లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ హ్యాకథాన్‌లో 35 టీమ్‌లు.. 144 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మేకిన్ ఇండియా అంటే ప్రతి వస్తువు ఈ దేశంలోనే తయారవ్వాలనే హ్యాకథాన్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.బాలరాజు పేర్కొన్నారు.

అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు బయటపడతాయన్నారు. తెలంగాణలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారని బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పేస్ యాప్స్ ఇండియా సహ వ్యవస్థాపకుడు చక్రధర్, తదితరులు పాల్గొన్నారు.

నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2022

ABOUT THE AUTHOR

...view details