తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తుకు ఆర్థిక శాఖ శ్రీకారం - బడ్జెట్​ 2021

రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనకు ఆర్థికశాఖ శ్రీకారం చుట్టింది. డిసెంబరు వరకు రాష్ట్ర రాబడులపై పూర్తి స్పష్టత రావడంతో ఆ ప్రాతిపదికగా బడ్జెట్‌ రూపొందించనున్నారు. ప్రధానంగా పీఆర్‌సీ అమలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉండనుంది. దీంతో పాటు కొత్తగా ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నారు. వీటికి సంబంధించిన వ్యయం అదనంగా ఎంత అవుతుందనే అంశాన్ని గుర్తించనున్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తుకు శ్రీకారం
రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తుకు శ్రీకారం

By

Published : Jan 8, 2021, 6:48 AM IST

రాబడులపై స్పష్టత రావడం వల్ల ఆర్థిక శాఖ రాష్ట్ర బడ్జెట్​ రూపకల్పనకు శ్రీకారం చుట్టుంది. శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరించేందుకు ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు మినహా మిగిలిన రాబడుల అంచనాలను ఆర్థిక శాఖ రూపొందిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ల మొత్తంపై ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత వస్తుంది.

పీఆర్‌సీ, ఉద్యోగాల భర్తీకి నిధులు

ప్రధానంగా పీఆర్‌సీ అమలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉండనుంది. దీంతో పాటు కొత్తగా ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నారు. వీటికి సంబంధించిన వ్యయం అదనంగా ఎంత అవుతుందనే అంశాన్ని గుర్తించనున్నారు. సాధారణ వ్యయంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రైతుబంధు, ఆసరా పింఛన్లు, విద్యుత్‌ సహా ఇతర రాయితీలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు గతం కంటే పెరుగుతాయని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది.

కొవిడ్‌ ప్రభావం.. మూణ్నెల్ల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల లావాదేవీల రాబడి అంచనాలపై ప్రభావం చూపింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం అంచనాల మేరకు ఇప్పటికే వచ్చింది. కేంద్ర పన్నుల వాటాలో అంచనాల కంటే ఇప్పటివరకు సగమే అందింది. అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడులు 50 శాతానికి పైనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల రాబడి 31 శాతంగా ఉంది. పన్నేతర రాబడి రూ.30,600 కోట్లు అంచనా వేయగా డిసెంబరు వరకు రాబడి రూ.2500 కోట్ల లోపే ఉంది. ఈ నేపథ్యంలో అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడులు, పన్నేతర రాబడి, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ల ప్రాతిపదికగా బడ్జెట్‌ కసరత్తు జరగనుంది.

రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తుకు శ్రీకారం

ఇదీ చూడండి:యాదాద్రి కొండ కింద నిర్మిస్తున్న కొలనుకు 'లక్ష్మీ పుష్కరిణి'గా నామకరణం

ABOUT THE AUTHOR

...view details