Minister fires on officials: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గమైన మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్ డివిజన్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది.
ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసి ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. అధికారులు ఒక శిలాఫలకాన్ని దిమ్మెలకు ఏర్పాటు చేయగా..మరో శిలాఫలకాన్ని ఓ ఇంటికి, మరొకటి రెండు విద్యుత్ స్తంభాలకు వైర్లతో బిగించి గాల్లో వేలాడదీశారు.