తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుపతి, కర్నూలులో ‘ప్లాస్మా’ సేకరణ - kovid news

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి నుంచి ‘ప్లాస్మా’ సేకరించి భద్రపరిచేలా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం తిరుపతి. కర్నూలులో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది.

the-medical-health-department-is-taking-steps-to-collect-and-store-plasma-samples-from-the-victims-of-the-coronary-pandemic
తిరుపతి, కర్నూల్​లో ప్లాస్మా సేకరణ

By

Published : May 6, 2020, 11:47 AM IST

కరోనా బారినపడి కోలుకున్న వారి నుంచి ‘ప్లాస్మా’ సేకరించి భద్రపరిచేలా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. తిరుపతి స్విమ్స్‌, కర్నూలు వైద్య కళాశాలలోని రక్తనిధి కేంద్రాల్లో ఈ ఏర్పాట్లు చేస్తోంది. వైరస్‌ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ చికిత్సకు ఆమోదం తెలపాలని ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్‌, తిరుపతి స్విమ్స్‌.. ఐసీఎంఆర్‌కు దరఖాస్తులు చేసుకున్నాయి. ఇంకా అనుమతి రాలేదు. మరోవైపు వైరస్‌ కేసుల నమోదు దృష్ట్యా అనంతపురం జిల్లా హిందూపురం ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details