తెలంగాణ

telangana

ETV Bharat / state

సోమవారం నుంచి ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు

సోమవారం నుంచి ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు
సోమవారం నుంచి ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు

By

Published : Oct 9, 2020, 10:10 PM IST

Updated : Oct 9, 2020, 11:05 PM IST

22:05 October 09

ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని నిర్ణయం

 రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ఓపీ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో... దాదాపు  5 నెలల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాన్ కొవిడ్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. గాంధీ, కింగ్ కోఠి, టిమ్స్ ఆస్పత్రి మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి ప్రకటించారు.

  ఈ మేరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరిండెంట్​లకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సోమవారం నుంచి అన్ని సాధారణ సేవలు కొనసాగించాలని పేర్కొంటూ... గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆస్పత్రి మినహా ఇతర అన్ని సర్కారు  ఆస్పత్రుల్లో  క్వారంటైన్ సెలవులు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సోమవారం నుంచి గతంలో మాదిరిగా యధావిధిగా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకావాలని తెలిపారు.

ఇదీ చూడండి:ఒక్కసారిగా వాన.. నిండుకుండలా భాగ్యనగరం

Last Updated : Oct 9, 2020, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details