ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. మొదట చాకుతో తరువాత కర్రతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ వేసుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్.. ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగుల పైనా ఆగ్రహం వెళ్లగక్కాడు.
మాస్క్ పెట్టుకోమన్నందుకు చాకుతో దాడి చేసిన అధికారి..! - nellore crime news
మాస్క్ వేసుకోవాలని చెప్పినందుకు ఓ మహిళా ఉద్యోగిపై అధికారి దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో జరిగింది. దీనిపై ఉద్యోగిని నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సదరు అధికారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు.
మాస్క్ వేసుకోవాలని చెప్పినందుకు ఉద్యోగినిపై అధికారి దాడి
2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా
Last Updated : Jun 30, 2020, 12:22 PM IST
TAGGED:
nellore crime news