విద్యుత్ కార్మికుల సమస్యల పట్ల స్పందించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కార్మికులతో యాజమాన్యం సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్, జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్, జెన్కో హెచ్ఆర్డీ అశోక్ కుమార్‌తో రాష్ట్ర నాయకులు సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. విద్యుత్ కార్మికుల తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ భేటీలో ఉద్యోగులు, ఆర్టిజన్, ఇతర కార్మికులకు సంబంధించిన సుమారు 80 అంశాలపై చర్చించారు.
'సమస్యల పట్ల స్పందించిన మంత్రులకు ధన్యవాదాలు' - Transco news
ఈరోజు విద్యుత్ కార్మికులతో యాజమాన్యం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఉద్యోగులు, ఆర్టిజన్, ఇతర కార్మికులకు సంబంధించిన సుమారు 80 అంశాలపై చర్చించారు.

ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించినట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చించిన తర్వాత టీఆర్వీకేఎస్ యూనియన్‌తో సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి , సాదం రామకృష్ణ, బీవీఎస్ మూర్తి, జెన్కో ప్రెసిడెంట్ రఘు, ఎస్పీడీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు యూసుఫ్, కరెంట్ రావు, , ట్రాన్స్‌కో అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, రాములు, ఆర్టిజన్ కార్మిక నాయకుడు వెంకట్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్