న్యాయవాదులు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వంపై ఆధారపడవద్దని.. సొంతంగా నిధి సమకూర్చుకోవాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వేళ ఇబ్బంది పడుతున్న న్యాయవాదులకు రూ.50 వేలు, క్లర్కులకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
స్వతంత్ర వృత్తిలో ఉన్న న్యాయవాదులకు ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సాయం చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్, న్యాయవాదుల సంఘాలదేనని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. సీనియర్ న్యాయవాదుల సహకారంతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కార్పస్ ఫండ్, అవసరమైన న్యాయవాదులకు పంపిణీ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్‌కు సూచించింది. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో వివరాలు సమర్పించాలని బార్ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది.
వీలైనంత త్వరగా చేపట్టండి...