KRMB MEET: ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా - ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
12:50 August 24
KRMB MEET: ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన బోర్డు భేటీని సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. 27వ తేదీన జరగాల్సిన 14వ సమావేశం ఎజెండాను బోర్డు గతంలోనే ఖరారు చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు పంపించింది.
ఇరు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలు, గెజిట్ నోటిఫికేషన్ పరిధి సంబంధిత అంశాలను అధికారులు ఎజెండాలో చేర్చారు. మరికొన్ని అంశాలను చేర్చాలని కోరుతూ రెండు రాష్ట్రాలు కూడా బోర్డుకు లేఖలు రాశాయి. అయితే బోర్డు 14వ సమావేశాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో బోర్డు భేటీ జరగనుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి. సింగ్ సెలవులో ఉన్నందున భేటీ వాయిదా వేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి:REVANTH REDDY: మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష